మంత్రి తలసానిని కలిసిన రాహుల్ సిప్లిగంజ్

228
Rahul meets Talasani

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ 3 విజయవంతంగా ముగిసిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ కు చెందిన సింగర్ రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ 3 విజేతగా నిలిచారు. బిగ్ బాస్ తర్వాత రాహుల్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. మెగాస్టార్ చేతుల మీదుగా రాహుల్ రూ.50లక్షల చెక్, బిగ్ బాస్ టైటిల్ ను అందుకున్నారు.

ఇదిలా ఉండగా రాహుల్ తాజాగా తెలంగాణ పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మంత్రి తలసానితో దిగిన ఫోటోను తన ఇన్‌‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రాహుల్.. ‘డైనమిక్ లీడర్.. డౌన్ టు ఎర్త్..’ అంటూ తలసానిని పొగిడేశాడు. ఆయన్ని కలవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.