ఇప్పటి వరకు తెలుగులో హయ్యస్ట్ రెమ్యూనిరేషన్లు తీసుకుంటున్న హీరోల లిస్ట్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ముందువరుసలోనే ఉన్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్..లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ పేర్లు కూడా బాగానే వినిపిస్తున్నాయి. అలాగే రామ్ చరణ్ కూడా బాగానే డిమాండ్ చేస్తున్నాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం 50 కోట్లు తీసుకుంటున్నారు. అలాగే బాలయ్య 22 కోట్లు, రవితేజ 20 కోట్లు తీసుకుంటున్నారని టాక్ వుంది. ఇక పవన్ కళ్యాణ్ 70 కోట్లు కూడా పుచ్చుకుంటున్నారు అంటూ రూమర్లు ఉన్నాయి.
అయితే, మహేష్ బాబు ఇప్పుడు రెమ్యూనిరేషన్ పుచ్చుకోవడంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేలా ఉన్నారు. మహేష్ బాబు సహజంగానే కమర్షియల్ గా ఉంటాడు. అందుకే గుంటూరు కారం సినిమాకు చాలా అంటే చాలా భారీ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మహేష్ బాబు ఏకంగా 80 కోట్ల రెమ్యూనిరేషన్, లాభాల్లో మూడో వంతు వాటా తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఒక వంతు రెమ్యూనిరేషన్ ప్రాజెక్ట్ సెట్ చేసిన నమ్రత కు ఇస్తారని భోగట్టా. మిగిలిన ఒక వంతు నిర్మాతలకు. సినిమా నిర్మాణానికి మహేష్ రెమ్యూనిరేషన్ లతో కలిపి 225 కోట్ల వరకు అవుతుందని తెలుస్తోంది.
Also Read:గుండెపోటుకు సంకేతాలివే..బి కేర్ ఫుల్!
ఈ లెక్కన ఈ సినిమా నిర్మాత నాగవంశీకు ఓ పది కోట్లు మిగలాలి అన్నా సినిమా మొత్తం 150 కోట్లు పైగా మార్కెట్ చేయాల్సి వుంటుంది. నాన్ థియేటర్ మీద 100 కోట్ల మేరకు రావాల్సి వుంటుంది. అది సాధ్యమేనా ?. మహేష్ సినిమా రెండు వంద కోట్లు కలెక్ట్ చేయడమే ఇంతవరకు జరగలేదు. మరి ఏ లెక్కన గుంటూరు కారం సినిమాకు పెట్టుబడి వర్కౌట్ అవుతుందో చూడాలి. దర్శకుడు త్రివిక్రమ్ కూడా ఈ మధ్య బాగా కమర్షియల్ గా మారాడు. మరి ఇంత కమర్షియల్ గా ఉన్న దర్శకుడు ఎంత తీసుకుంటున్నాడో మరి.
Also Read:పిక్ టాక్ :హద్దులు దాటిన అందాలండోయ్