చొక్కా పట్టుకుని కొట్టిందట !

236
rakul preet singh venkatadri express
rakul preet singh venkatadri express
- Advertisement -

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. అసలే అమ్మాయిది జిమ్ బాడీ. ఎప్పుడూ ఫిట్ నెస్ ని కాపాడుకొంటూ ఉంటుంది. దానికి తోడు ఆర్మీ కుటుంబం నుంచి వ‌చ్చింది. త‌న‌తో పెట్టుకొంటే ఎవ‌రైనా స‌రే.. చెడుగుడు ఆడేసుకొంటుంది. ఓ పోకిరిని హీరోలా ప‌రిగెట్టించి ప‌రిగెట్టించి మ‌రీ కొట్టింద‌ట‌. అయితే ఇప్పుడు కాదు. టాప్ హీరోయిన్లుగా ఉండే వారి నోటి నుంచి గతానికి సంబంధించిన విషయాలు అంతగా బయటకు రావు. కానీ.. రకుల్ తీరు వేరు. ఓపెన్ గా చెప్పేస్తుంది. ఒక మీడియా సంస్థకు చెందిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రకుల్ పాల్గొంది..

rakul preet singh

ఢిల్లీలోని జీసస్‌ అండ్‌ మేరీ కాలేజీ నుంచి మ్యాథ్స్‌ ఆనర్స్‌లో డిగ్రీ చేసిన రకుల్‌.. ఎవరైనా తప్పు చేసినా వూరుకునేదాన్ని కాదని చెప్పింది. కాలేజీలోని తమ క్యాంపస్‌ చాలా శుభ్రంగా ఉండేదంది. “ఓ రోజు మేం నడిచివెళ్తుంటే కారులో వెళ్తున్న కొందరబ్బాయిలు బీర్‌బాటిల్‌ని రోడ్డుపైకి విసిరేశారు. నాకు కోపం వచ్చేసింది. వెంటనే దాన్ని తీసుకుని వెళ్తొన్న ఆ కారుమీదకే విసిరేశా. దాంతో వాళ్లు గొడవకొచ్చారు. నేనూ తగ్గలేదు. చివరకు వెళ్లిపోయారు. మరోసారీ అంతే. నైనిటాల్‌కి స్నేహితులంతా కలిసి విహారయాత్రకు వెళ్లాం. ఒకబ్బాయి మమ్మల్నే అనుసరించడం గమనించలేదు. అక్కడ ఓ కోటు కొనుక్కుందామని బేరాలాడుతుంటే ఫొటోలు తీయడం మొదలుపెట్టాడు. ఫ్రెండ్‌ అది చూసి నాకు చెప్పింది. నేరుగా అతని దగ్గరికే వెళ్లి ఫోన్‌ ఇవ్వమని అడిగా. ఇవ్వకపోవడంతో లాక్కున్నా. మా ఫొటోలు కనీసం ఇరవైవరకూ ఉన్నాయి. డిలీట్‌ చేయమంటే చేయలేదు. చొక్కా పట్టుకుని కొట్టా.”నని చెప్పుకోచ్చింది రకుల్‌. తనకు సాధారణంగా కోపం రాదని.. కానీ ఒకసారి వస్తే మాత్రం అగ్నిపర్వతం బద్ధలైనట్లేనని చెప్పుకొచ్చింది.

- Advertisement -