రొమేనియా వెళ్లనున్న సూపర్‌స్టార్…

196
Mahesh babu Spyder Song Shoot in Romania
- Advertisement -

మహేష్-మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న ‘స్పైడర్’ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉండటంతో ఈ మూవీ కోసం మహేష్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ‘స్పైడర్’ సినిమా ఒక పాట మినహా ఈ సినిమా షూటింగ్ అంతా పూర్తయింది. తెలుగుతో పాటు తమిళం హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే కొరటాల శివ దర్శకత్వంలో ‘భరత్ అను నేను’ సినిమా కూడా చేస్తున్నాడు మహేష్‌ . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది. ఒక వైపున ఆ మూవీ షూటింగులో పాల్గొంటూనే, మరో వైపున ఆయన ‘స్పైడర్’ మూవీ డబ్బింగ్ ను పూర్తి చేసే పనిలో వున్నాడు.

Mahesh babu Spyder Song Shoot in Romania

‘భరత్ అను నేను’ సినిమా టీం కొన్ని రోజుల క్రితం ష్యూటింగ్‌ కోసం లక్నో వెళ్లింది. అక్కడ మంగళవారం వరకూ షూటింగ్ జరగవలసి వుంది. అయితే మూడు రోజుల ముందే అక్కడి షూటింగును పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని దర్శక నిర్మాతలు స్పష్టం చేశారు. ఈ షెడ్యూల్ అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందని చెప్పారు.

అయితే వచ్చేవారమే ‘స్పైడర్’ టీమ్ తో కలిసి పాట చిత్రీకరణ కోసం మహేశ్ బాబు ‘రొమేనియా’ వెళుతున్నాడు. ఫారిన్ షూట్ కి వెళ్లడానికి ముందు ఆయనకి ఓ రెండు రోజుల పాటు రెస్ట్ అవసరమని భావించే, ‘భరత్ అను నేను’ షూటింగును అనుకున్నదానికంటే 3 రోజుల ముందుగా పూర్తి చేశారని అంటున్నారు. ‘భరత్ అను నేను’ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -