బళ్లారిలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) పరిపాలనా కార్యాలయం ముందు షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. KMF ప్రస్తుతం ఆర్థిక నష్టాలతో సతమతమవుతోంది. దీంతో 50 మంది ఉద్యోగులను తొలగించడానికి జాబితాను సిద్ధం చేసింది.
ఇదంతా జరుగుతుండగా ఆఫీస్ మెయిన్ డోర్ ముందు చేతబడి చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒక నల్ల బొమ్మ, మేకులు కొట్టిన పెద్ద గుమ్మడికాయ, కొబ్బరి, నిమ్మకాయలు, కుంకుమ మరియు ఎరుపు సింధూరం వంటి వింత వస్తువులను చూసి ఆశ్చర్యపోయారు.
అంతేగాదు ఓ చిన్న కలశం దానిచుట్టూ దారం చుట్టడం, కొబ్బరికాయకు తాయెత్తు సంచిని కట్టడంతో అంతా భయాందోళనకు గురయ్యారు. అలాగే ప్రతి వస్తువపై కుంకుమ, గుమ్మడికాయ, నిమ్మకాయలలో గోర్లు ఉండటంతో అంతా ఆందోళన చెందారు. ఎవరు ఇలా చేశారు అన్న దానిపై సీసీటీవీని పరిశీలించగా ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. ఉద్యోగులను తొలగిస్తున్నారన్న వార్తల నేపథ్యంలోనే ఈ పని చేసి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది.