శోభిత హాట్.. నో డౌట్

23
- Advertisement -

బాలీవుడ్ లో చాలామంది భామలే ఉంటారు. అయితే, అందరూ ముంబై నుంచే రారు. ఆంధ్రలోని తెనాలి నుంచి కూడా వెళ్లారని ఘనంగా నిరూపించింది శోభిత ధూళిపాళ. ఐతే, శోభిత ధూళిపాళ స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. అయితే ఏం ?, శోభిత ధూళిపాళ ఈ మధ్య సోషల్ మీడియాను చెడుగుడు ఆడుకోవడమే పనిగా పెట్టుకుంది. తెగ హాట్ ఫోటో షూట్లు చేస్తూ రచ్చ చేస్తోంది. అందుకే, ఈ భామకు ఇన్స్టాలో దాదాపు 2 మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు.

ఇక శోభిత ధూళిపాళ హాటు ఫోటో షూట్లు అనేవి ఈ భామ జీవితంలో విడదీయలేని భాగం అయ్యాయి. అవి లేకపోతే ఏదో ఒక ఫోటో తీసుకుని ఆవి పోస్ట్ చేస్తూ నిత్యం లైమ్ లైట్ లో ఉంటుంది శోభిత. తాజాగా శోభిత ధూళిపాళ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఫోటోలో శోభిత ధూళిపాళ అందమైన బ్లాక్ డ్రెస్ లో కనిపించింది. తన అందచందాలు అలా విరబూస్తూ నిలుచుంది. అలా శోభిత ధూళిపాళ నలుపు డ్రెస్ తో నిలుచుంటే ఎవరూ ఫోటో స్టొరీలు రాయరు. అందుకే.. ఆ మతలబు తెలుసు కాబట్టి, తన అంతః సౌందర్యాన్ని ఫోటోకు శోభిత పూర్తిగా ధారపోసింది.

పైగా ‘మీక్కావలసింది.. నా దగ్గర ఉంది’ అని అదేదో తెలుగు పాట లాగా శోభిత ధూళిపాళ ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. ఒక్క ముక్కలో చెప్తే ఫోటో యమ హాటో.. నో డౌటో! ఇలాంటి ఫోటోలకు ఘాటు కామెంట్లు వస్తాయి కదా.. వచ్చాయి. “శోభిత ధూళిపాళ నువ్వు సూపర్ హాట్ బ్యూటీ”.. “కూల్ బేబీ.. హాట్ లుక్స్”.. “శోభిత నువ్వెప్పుడూ ఇంతేనా”.. “శోభిత ధూళిపాళ.. నీకు బట్టలు ఉన్నాయి కదా?” అంటూ కొందరు స్పందించారు. మొత్తానికి శోభిత ధూళిపాళ తనదైన శైలిలో రెచ్చిపోయింది.

ఇవి కూడా చదవండి…

హీరామండి…ఫస్ట్‌ లుక్ పోస్టర్‌

అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం

మైఖేల్ ఓటీటీలోకి ఎప్పుడంటే…

- Advertisement -