విద్యార్థుల కేసులను ఉచితంగా వాదిస్తాం!

3
- Advertisement -

పరీక్షల పేపర్ లీకేజీలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలపై ఇటీవల జరిగిన విద్యార్థుల ఆందోళనల (CJP నిరసనల) సమయంలో వారిపై నమోదైన పోలీసు కేసుల విషయంలో శివసేన (యుబిటి) కీలక నిర్ణయం తీసుకుంది. ఆందోళనల్లో పాల్గొని కేసుల్లో చిక్కుకున్న విద్యార్థుల తరఫున ఉచితంగా న్యాయ పోరాటం చేస్తామని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాక్రే) నాయకుడు ఆదిత్య థాక్రే ప్రకటించారు.

విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, పోలీసు చర్యలకు వ్యతిరేకంగా తమ పార్టీ చట్టపరమైన సహాయం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు తమ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్నప్పుడు వారిపై కేసులు పెట్టడం సరికాదని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని శివసేన (యుబిటి) లీగల్ టీమ్ ఈ కేసులను ఉచితంగా వాదిస్తుందని తెలిపారు.

విద్యార్థులకు మద్దతుగా నిలవడం తమ బాధ్యత అని ఏ ఒక్క విద్యార్థి కూడా ఒంటరిగా అనుభవించాల్సిన అవసరం లేదని ఆదిత్య థాక్రే పేర్కొన్నారు.

Also Read:మోదీ ఫేస్‌బుక్ వీడియో బ్లాక్‌..’మెటా’ వివరణ

- Advertisement -