జోడో యాత్రలోకి థాక్రే వర్గం…

151
- Advertisement -

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సారథ్యంలో చేపట్టిన భారత్‌ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. కేరళ నుంచి మొదలైన ఈ యాత్ర తమిళనాడు, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోకి అడుగుపెడుతోంది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే అనే ఉహాగానాల మధ్య స్పష్టత నెలకొంది.

శివసేన నుంచి ఉద్దవ్‌ థాక్రే కోడుకు, యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాక్రే భారత్‌ జోడో యాత్రలో పాల్గోననున్నారని శివసేన (థాక్రే) గ్రూప్ ఎమ్మెల్యే సచిన్‌ అహిర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గతంలోనే మహారాష్ట్రలో కాంగ్రెస్‌ శివసేన కలిసి కూటమి ఏర్పరుచుకొని ప్రభుత్వంను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శివసేన నాయకులు భారత్‌జోడో యాత్రలో పాల్గొంటుదని ఉద్దవ్‌ థాక్రే ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ప్రకటించారు.

మహారాష్ట్రలో బీజేపీ, షిండే గ్రూప్, ఎంఎన్ఎస్‌ను ఎదుర్కోవాలంటే మహా వికాస్ అఘాడి బలపడాల్సిన అవసరం ఉందని, ఆ కారణంగానే భారత్ జోడో యాత్రలో పాల్గొనాలనే నిర్ణయం శివసేన తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మహారాష్ట్రలో భారత్‌జోడో యాత్ర ఐదు జిల్లాలోను కలుపుతూ 384కిలోమీటర్లు సాగనుంది. ఈ మొత్తం దూరంను 14రోజుల పాటు ఈ మొత్తం దూరంను మహారాష్ట్రలో కొనసాగతుందని ప్రకటించారు. నాందేడ్‌, హింగోలి, వాసిం, అకోలా, బుల్దానా జిల్లాలో ఈయాత్ర సాగుతుంది.

ఇవి కూడా చదవండి..

గీత దాటితే చర్యలు తప్పవు

పత్తా లేని చెయ్యి…

చీతాల వేట మొదలైంది..

- Advertisement -