మరో ఎదురుదెబ్బ : ఉద్ధవ్‌

34
shivasena
- Advertisement -

మహారాష్ట్ర తాజాగా మరో సంక్షోభంలో పడింది. థానె మున్సిపల్‌ కార్పోరేషన్‌ (టీఎంసీ)లో 66మంది సేన కార్పోరేటర్లు ఏక్‌ నాథ్‌ షిండేతో కలిశారు. మహా సర్కారును నిలబెట్టుకొవడంలో విఫలమయిన ఉద్ధవ్ థానె మున్సిపల్‌ కార్పోరేటర్లను కూడా కొల్పోపాయారు. సేన కార్పోరేటర్ల తిరుగుబాటుతో టీఎంసీ పై ఉద్ధవ్‌ పట్టు కొల్పోయారు.

మ‌హారాష్ట్ర‌లో బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ (బీఎంసీ) త‌ర్వాత టీఎంసీ రెండవ అతి పెద్ద న‌గ‌ర‌పాల‌క సంస్ధ కావ‌డం గ‌మ‌నార్హం. 2019లో ఎన్సీపీ కాంగ్రెస్‌ తో పొత్తుగా మహా ఆఘాడీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెండున్నర సంవత్సరాల్లో ప్రభుత్వంను చేజార్చుకున్నాడు. సీనియ‌ర్ నేత ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో ఉద్ధ‌వ్ ఠాక్రే రాజీనామా చేయ‌డంతో జూన్ 29న మ‌హా వికాస్ అఘాడి ప్ర‌భుత్వం కూలిపోయింది. షిండే కు బీజీపీ మద్దతుతో సీఎంగా ప్రమాణం చేశాక….. థానే కార్పోరేటర్లు తిరుగుబాటు చేయడం ఉద్ధవ్‌ నాయకత్వాన్నికి ప్రశ్నార్థకం చేసిందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -