కరోనా బారిన పడ్డ టీమిండియా ఆల్‌రౌండర్‌

63
dube

టీమిండియా ఆల్‌రౌండర్‌ శివమ్ దుబే కరోనా బారిన పడ్డారు. ఆదివారం ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించగా దుబేతో పాటు వీడియో ఎనలిస్ట్‌ గణేశ్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టుకు దుబే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. దీంతో త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీకు అతడు దూరమయ్యాడు. అతడి స్ధానంలో సాయిరాజ్‌ పటేల్‌ని ఎంపికచేశారు.

ఇక బెంగాల్‌ జట్టులో 7గురు ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక రంజీ ట్రోఫీ జనవరి 13నుంచి ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ముంబై జట్టు తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్ర తో తలపడనుంది.