నటుడు శివాజీరాజా తండ్రి మృతి

2
- Advertisement -

సీనియర్ నటుడు శివాజీరాజా తండ్రి జి. రామరాజు (85) కన్నుమూశారు. వయోభారం కారణంగా ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో మంగళవారం ఉదయం 8 గంటలకు మధురానగర్‌లోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామరాజు పరిస్థితి ఇటీవల మరింత విషమించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

రామరాజు మృతి వార్త తెలిసి సినీ, రాజకీయ వర్గాలకు చెందిన పలువురు ప్రముఖులు శివాజీరాజా కుటుంబానికి సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Also Read:దేవరకొండ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో నేడు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కుటుంబ సభ్యులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నారు. రామరాజు ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -