క్షేమంగా భారత్ చేరుకున్న పీవీ సింధు

4
- Advertisement -

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కొన్ని రోజులు దుబాయ్‌లో చిక్కుకుపోయిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు క్షేమంగా ఇండియా చేరుకున్నారు. ప్రస్తుతం సురక్షితంగా ఇండియాకి చేరుకున్నానని తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు సింధు.

తనకు ఈ క్లిష్ట పరిస్థితుల్లో సహకరించిన దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు సింధు. మరోవైపు గల్ఫ్ లో చిక్కుకున్న ఇండియన్స్ కోసం కేంద్రం చర్యలు చేపట్టింది.

ఇవాళ జెడ్డా నుంచి 10 ప్రత్యేక విమానాలు నడపనుంది ఇండిగో. UAE లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు పుజైరా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చికి 4 స్పెషల్ స్పైస్ జెట్ ఫ్లైట్స్ నడపనుండగా అబుదాబి నుంచి ఢిల్లీ చేరింది ఎతిహాద్ ఎయిర్ లైన్స్.

Also Read:దేవరకొండ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు

- Advertisement -