రీ ఎంట్రీతో అదుర్స్ అనిపిస్తున్నాడు నటుడు శివాజీ. ఇటీవలె కోర్ట్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన శివాజీ తాజాగా దండోరా మూవీతో రానున్నాడు. కలర్ ఫోటో, బెదురులంక 2012 లాంటి సినిమాలతో హిట్స్ కొట్టిన లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో మురళీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దండోరా .
ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న దండోరా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ షూటింగ్ మొదలుపెట్టింది. 25రోజుల పాటు కంటిన్యూగా జరగనున్న ఈ షెడ్యూల్‌లో శివాజీ పాల్గొంటున్నారు.
కులాల వ్యత్యాసం, కులాంతర వివాహం కాన్సెప్ట్ మీద తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఈ దండోరా సినిమా రానుంది. శివాజీతో పాటు నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Also Read:BRS రజతోత్సవం..3వేల బస్సులు ఇవ్వండి