వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అక్కినేని నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన చిత్రం శివ. ఈసినిమా విడుదలై నేటితో 30ఏండ్లు పూర్తి చేసుకుంది. 1989 అక్టోబర్ 5 ఈమూవీ విడుదలైంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున, అమల హీరో హీరోయిన్లు నటించారు. అప్పట్లో ఈమూవీ సరికొత్త రికార్డును సృష్టించింది. నాగార్జున కెరీర్ కు ఈమూవీ కీలకం అయ్యింది. ఈసినిమా విడుదల తర్వాత అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నాగార్జున.
అప్పుడే తెలుగు చిత్ర పరిశ్రమలోకి కాలుమోపిన వర్మ, పరిశ్రమకు కొత్తదనాన్ని పరిచయం చేస్తూ ‘శివ’ను తీశాడు. ఇక ఈ సినిమా విడుదలై 30 సంవత్సరాలు అయిన సందర్భంగా ట్విట్టర్ వేదికగా, తన ఆనందాన్ని పంచుకుంటూ, “నాగ్. నేడు మన ప్రియమైన బిడ్డ 30వ పుట్టినరోజు” అని తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమాను తమిళంలో డబ్ చేస్తే అక్కడ సూపర్ హిట్టైయింది. శివ సినిమాను హిందీలో రిమేక్ చేయడం ద్వారా బాలీవుడ్ కు పరిచయమయ్యారు.
Hey @iamnagarjuna , today is the 30th birthday of our love child 😍😍😍 pic.twitter.com/i7RLgjiX95
— Ram Gopal Varma (@RGVzoomin) October 5, 2019