ఉపాసనకు మహాత్మా గాంధీ అవార్డు

743
Upasana Konidela
- Advertisement -

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అందరికి సుపరిచితురాలే. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రామ్ చరణ్ భార్యగానే కాకుండా అపోలో హాస్పటిల్స్ అధినేత మనవరాలిగానే కాకుండా, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతూ ఎంతో మందికి అండగా నిలుస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పేదలకు, అనాథ బాలలకు సాయం చేస్తూ మంచి మనసున్న మనిషిగానూ గుర్తింపు పొందారు ఉపాసన. తన సేవలకు గుర్తింపుగా.. ఆ మధ్య ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే.తాజాగా ఉపసానకు మరో అవార్డు వరించింది.

ఉపాసన వివిధ సామాజిక కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతున్న సందర్భంగా కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటి నాయకత్వ విభాగంలో తన సేవలకు గుర్తింపుగా మహాత్మా గాంధీ అవార్డు సొంతం చేసుకున్నారు. ఈవిషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

- Advertisement -