ప్రతీ నటుడు చేయాలనుకునే సినిమా ఇది- హీరో శివ

117
- Advertisement -

‘చూసీ చూడంగానే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శివ కందుకూరి హీరోగాా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. లవ్ అండ్ వార్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ సినిమాను ప్రొద్దుటూరు టాకీస్ ప‌తాకంపై నార‌ల శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. భరత్ పెదగాని దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ‘మను చరిత్ర’ ప్రీ ఫేస్ పేరుతో టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో..

హీరో శివ కందుకూరి మాట్లాడుతూ.. ‘ప్రతీ ఒక్క నటుడు తన కెరీర్‌లో ఓ సినిమా చేయాలి అనుకుంటారు. అదే మనుచరిత్ర. నవ్వించాలి, ఏడిపించాలి, యాక్షన్ చేయాలని అనుకుంటారు. అలా హీరోలకు ఓ బకెట్ లిస్ట్ ఉంటుంది. నా బకెట్ లిస్ట్ అంతా కూడా ఈ ఒక్క చిత్రంతోనే నెరవేరింది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు దర్శకుడు భరత్ గారికి థ్యాంక్స్. ఆయన ఇంకా ఎంతో కాలం ఇండస్ట్రీలో ఉంటాడు.. ఎన్నో మంచి చిత్రాలను అందిస్తాడు. ఏ సినిమాకైనా మంచి యూనిట్ దొరకడం అదృష్టం. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరూ ప్రేమిస్తూ పని చేశారు. ప్రతీ ఒక్క ఫ్రేమ్‌లో అది మీకు కనిపిస్తుంది. ధనుంజయ్ గురించి, ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. తెలుగులో ఆయన్ను ఇంకా ఎన్నో సినిమాల్లో చూస్తాం. సుహాస్ ఎంతో మంచి వాడు. నాకు ఈచిత్రం నుంచి సుహాస్, దనుంజయ్ రూపంలో మంచి స్నేహితులు దొరికారు. ఎంతో మంచి నటీనటులు ఈ చిత్రంలో ఉన్నారు. ఈ సినిమా చూశాక మీరంతా కూడా మేఘా ఆకాష్ ప్రేమలో పడిపోతారు. చాలా కష్టపడి, ఎంతో నిజాయితీతో ఈ చిత్రాన్ని చేశాం. మా ప్రీ ఫేస్ మీకు (ప్రేక్షకులు) నచ్చి ఉంటుందని భావిస్తున్నాను. మేం ఇలా ఈ రోజు మీ ముందుకు వచ్చి మాట్లాడుతున్నామంటే నిర్మాత శ్రీనివాస్ రెడ్డి దానికి కారణం. మమ్మల్ని నమ్మి, దేని గురించి కాంప్రమైజ్ కాకుండా మాకు సపోర్ట్‌గా నిలిచారు. సెకండ్ వేవ్ తరువాత వచ్చిన చిత్రాలు మీడియా వల్లే ప్రేక్షకులకు అంతగా రీచ్ అవుతున్నాయి. నా సినిమా కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను’ అని అన్నారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘ఇంటెన్స్ లవ్ స్టోరీలతో వచ్చిన చిత్రాలు కచ్చితంగా హిట్ అవుతాయి. దేనితోనూ పోల్చను కానీ ఇటు వంటి కథలతో వచ్చిన చిత్రాలు హిట్ అవుతాయి. ఆర్ఆర్ లేకుండా ఈ చిత్రాన్ని నేను చూశాను. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా భరత్ కథ రాసుకున్నాడు. ఎక్కడా కూడా వల్గారిటీ, డబుల్ మీనింగ్ డైలాగ్‌లు కనిపించవు. ఇక ఈ సినిమాకు అతి పెద్ద బలం గోపీ సుందర్. ఎన్నో సినిమాలు చేస్తున్నా కూడా దీనికి ఎక్కువ సమయం కేటాయించారు. అద్బుతమైన సంగీతాన్ని అందించారు. ఇక ఈ సినిమాకు మరో బ్యాక్ బోన్ ధనుంజయ. ఆయన ఇప్పుడు పద్నాలుగు సినిమాలను చేస్తున్నారు. కన్నడ, తమిళం, తెలుగు, మళయాలం ఇలా అన్ని భాషల్లో నటిస్తున్నారు. రేపు పుష్ప విడుదలయ్యాక ధనుంజయ ఏంటో తెలుస్తుంది. ఇక చంద్రబోస్ గారు సైతం అద్భుతమైన పాటలు రాశారు. ప్రగతి, మేఘా ఆకాష్ ఇలా ప్రతీ ఒక్కరూ ఎంతో గొప్పగా నటించారు. శివ అద్భుతంగా చేశాడు. ఆ మాట రేపు ఆడియెన్స్ కూడా చెబుతారు’ అని అన్నారు.

దర్శకుడు భరత్ మాట్లాడుతూ.. ‘మను చరిత్ర ప్రీఫేస్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నిర్మాత శ్రీనివాస్ రెడ్డి గారికి థ్యాంక్స్. సిరా శ్రీ గారి వల్లే ఈ చిత్రం ప్రారంభమైంది. ఆయనే రాజ్ కందుకూరితో కలిపించారు. ఆయనకు స్క్రిప్ట్ నచ్చింది. ఆ తరువాత శివ, మేఘా ఆకాష్, ప్రగతి ఇలా అందరూ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. ధనుంజయ గారు ఈ సినిమాను ఒప్పుకోవడం చాలా సంతోషంగా అనిపించింది. నేను ఏ కథ రాసినా ముందుగా మధు గారికి వినిపిస్తాను. ఆయనే నా ఫిలాసఫర్. సినిమాటోగ్రఫర్ రాహుల్ శ్రీవాత్సవ ఈ సినిమాలో తన లైఫ్ పెట్టేశారు. చంద్రబోస్ గారు మా సినిమాకు రెండు పాటలు రాయడమే కాకుండా నటించారు. ఆయనకు చాలా థ్యాంక్స్. ఈ చిత్రానికి ప్రాణం గోప సుందర్ గారు. ఏడు అద్భుతమైన పాటలు ఇచ్చారు. బడ్జెట్ గురించి ఆలోచించుకు.. మంచి కథ.. మంచి సినిమా తీస్తున్నాం అని నా వెన్ను తట్టిన రత్తమయ్య గారికి థ్యాంక్స్. సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్స్ మత్తు కొంతసేపే ఉంటుంది.కానీ మనుచరిత్ర మాత్రం ఎప్పటికీ నిలిచిపోతుంద’ని అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. ‘ఏ సినిమాకు అయినా కథే ముఖ్యం. సినిమాను చూపించినట్టుగానే రెండు మూడు గంటల పాటు డైరెక్టర్ భరత్ నెరేషన్ ఇస్తారు. ఈ సినిమాకు కథే బలం అని అప్పుడే అర్థమైంది. అందుకే వినగానే ఓకే చెప్పాం. ఓ కొత్త దర్శకుడు మంచి కథ తీస్తే.. దాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలంటే మీడియా సహయం కావాలి. మీడియా సహాయసహకారాలు అందిస్తే.. మేం మరిన్ని మంచి చిత్రాలను తీస్తామ’ని అన్నారు.

హీరోయిన్ మాట్లాడుతూ.. ‘నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చిత్రయూనిట్‌కు థ్యాంక్స్. ఇంత ప్రేమ వస్తుందని ఊహించలేదు. బుట్టబొమ్మ పాటకు వేసిన స్టెప్పులు నన్ను ఈ చిత్రంలో నటించే వరకు తీసుకొచ్చాయి. దర్శకుడు భరత్ సర్ నన్ను పిలిచారు. కథ వినగానే నాకు ఎంతో నచ్చింది. మీకు కచ్చితంగా నచ్చుతుంది. నాకు మొదట్లో తెలుగు అంతగా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది. నాకు ఎంతో సాయం చేసిన శివకు థ్యాంక్స్. ఇండస్ట్రీలో నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు థ్యాంక్స్’ అని అన్నారు.

గోపీ సుందర్ మాట్లాడుతూ.. ‘ ఈ సినిమాకు పనిచేసినందుకు సంతోషంగా ఉంది. నన్ను ఈ చిత్రంలోకి తీసుకున్నందుకు దర్శకనిర్మాతలకు థ్యాంక్స్. మమల్ని సపోర్ట్ చేయండి. శివ కందుకూరి అద్భుతంగా నటించాడు. లిరిసిస్ట్ ఎంతో సహకరించారు. ప్రేక్షకుల్లోకి ఈసినిమాను తీసుకెళ్లేందుకు మీడియా సహకరించాలి’ అని అన్నారు.

- Advertisement -