బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ఇంకో వారం రోజుల్లో ముగియనుంది. వచ్చే ఆదివారం రోజు బిగ్ బాస 3 విజేత ఎవరో తేలిపోనుంది. కాగా హౌస్ లో మొత్తం ఆరుగురు సభ్యులు వరుణ్, శ్రీముఖి, అలీ రెజా, బాబా భాస్కర్, శివజ్యతి, రాహుల్ లు ఉండగా ఈవారం శివజ్యోతి ఎలిమినెట్ అయ్యింది. దీంతో వరుణ్, అలీ కూడా ఫైనల్‌కు వెళ్లిపోయారు. రాహుల్, వరుణ్, అలీ, బాబా భాస్కర్, శ్రీముఖి ఫైనల్ లో పోటీపడనున్నారు. వీరిలో విజేతగా నిలిచిన ఒక్కరు రూ.50 లక్షలు గెలుచుకోనున్నారు. అయితే ఆదివారం ఎపిసోడ్ లో రౌడి హీరో విజయ్ దేవరకొండ హౌస్ లో సందడి చేశారు. ఆయన నిర్మాతగా వ్యవహరించిన మీకు మాత్రమే చెప్తా సినిమా ప్రమోషన్స్ కోసం ఆసనిమా టీం బిగ్ బాస్ లోకి వచ్చారు. కాగా విజయ్ దేవరకొండ కన్ ఫెషన్ రూంలో కూర్చోని హౌస్ లో ఉన్న ఒక్కొక్కరిని పలిపించుకుని మాట్లాడారు.
మొదటిగా శ్రీముఖి వెళ్లింది. విజయ్ దేవరకొండను చూసి ఆశ్చర్యానికి గురైంది. కాసేపు ముచ్చటించింది. ఇంట్లో ఎవరిని లేపేయాలని నీకు అనిపిస్తుంది అని శ్రీముఖిని విజయ్ అడిగారు. తడబాటు లేకుండాశ్రీముఖి తరవాత బాబా భాస్కర్, అలీ రెజా, శివజ్యోతి, రాహుల్, వరుణ్ వరుసగా కన్ఫెషన్ రూంలోకి వెళ్లారు. వీళ్లలో రాహుల్ చెప్పిన సీక్రెట్ బాగుంది. అదెలాంటి సీక్రెట్ అంటే బిగ్ బాస్ కెమెరాల్లో రికార్డు కాని సీక్రెట్. అదేంటంటే.. రాహుల్‌ని పునర్నవి చేతిపై కరిచిందట. ఈ విషయాన్ని రాహుల్ కన్ఫెషన్ రూంలో విజయ్‌కి చెప్పాడు.
బాబా భాస్కర్ అని చెప్పింది శ్రీముఖి. కన్ఫెషన్ రూంలోకి వచ్చిన ప్రతి ఒక్కరిని విజయ్ ఒక బ్లాక్ బెలూన్ ఇచ్చారు. దాన్ని చాలా జాగ్రత్తగా పగిలిపోకుండా చూసుకోవాలని, దానిలో ఎలిమినేషన్ సీక్రెట్ ఉందని చెప్పారు విజయ్. ఆ తరవాత హౌస్‌మేట్స్‌తో విజయ్ దేవరకొండ ఇచ్చిన బెలూన్లను పగలగొట్టించారు. కానీ, ఆ బెలూన్లలో ఏమీ లేదు. అయితే, వేదికపై ఉన్న విజయ్ చేతికి ఒక బెలూన్ ఇచ్చారు. దాన్ని పగలగొట్టిన విజయ్.. వరుణ్ పేరును బయటికి తీశారు. అంటే, వరుణ్ సేఫ్. దీంతో శివజ్యోతి, అలీ మాత్రమే ఎలిమినేషన్‌లో మిగిలారు. అందరూ అనుకున్నట్లు గానే శివజ్యోతిని ఎలిమినెట్ చేశారు బిగ్ బాస్.