బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన శివబాలాజీ తెలుగు వారందరికి సరికొత్తగా సుపరిచితుడయ్యాడు. ఆవేశమన్న నెగిటివ్ పాయింట్‌ను పాజిటివ్ గా మార్చుకోవటంలో సక్సెస్ అయిన శివబాలాజీ.. బిగ్ బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచారు. సినిమా పరిశ్రమలో హీరోగా ఇది మా అశోగ్గాడి లవ్ స్టోరీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శివ బాలాజి హీరోగా కన్నా సపోర్టింగ్ రోల్స్ లో ఎక్కువ కనిపించాడు. ఇక బిగ్ బాస్ సీజన్ వన్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శివ బాలాజి నిర్మాతగా శివ బాలాజి, రాజీవ్ కనకాల లీడ్ రోల్స్ లో నటించిన సినిమా స్నేహమేరా జీవితం.
శివబాలాజీ ,రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో 1982 నాటి పరిస్థితులతో ఇద్దరు స్నేహితుల మధ్య ప్రేమ-పగల నేపథ్యంలో కమర్షియల్ హంగులతో స్నేహమేరా జీవితం అనే చిత్రాన్ని నిర్మించాడు శివబాలాజీ. అయితే ఈ సినిమా మొదటి షో తోనే ప్లాప్ టాక్ తెచ్చుకోవడం తో సినిమా వసూళ్లు దారుణంగా వచ్చాయి. కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాలేదని తెలుస్తుంది.బిగ్ బాస్ వల్ల కాస్తో కూస్తో పేరు రావడం తో శివబాలాజీ ఈ పాపులార్టీ ని కాష్ చేసుకోవాలని అనుకున్నాడు కానీ దారుణంగా దెబ్బతిన్నాడు.రాంగ్ టైమింగ్.. ప్రమోషన్ సరిగా లేకుండా సినిమా విడుదల కావటంతో బిగ్ బాస్ విజేత బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డారు. అన్ని ఇమేజ్ లు సినిమా సక్సెస్‌కు సాధ్యం కాదన్న విషయం ఈ ఉదంతంతో రుజువైనట్లే.