పద్మావతి సినిమా రిలీజ్ వాయిదా..

261
Deepika-starrer-Padmavati
- Advertisement -

సంజయ్ లీలా బన్సాలీ ‘పద్మావతి’ చిత్ర వివాదం సంచలన మలుపు తిరిగింది. ఈ చిత్రం విడుదలను అడ్డుకుంటామంటూ కర్ణిసేన దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుపుతున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా సినిమా విడుదలను వాయిదా వేయాలని చిత్ర నిర్మాణ సంస్థ వయాకామ్ 18 నిర్ణయించింది. తమంతట తాము ఈ నిర్ణయం తీసుకున్నామని సినిమా యూనిట్ వెల్లడించింది. కొత్త రిలీజ్ డేట్‌ను తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.

Padmavati-

సినిమాకు ఇంకా సీబీఎఫ్‌సీ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంది. దీనికోసం పద్మావతి టీమ్ దరఖాస్తు చేసుకున్నా.. అది అసంపూర్తిగా ఉందంటూ సీబీఎఫ్‌సీ తిరిగి పంపించేసింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇక వాయిదా వేయక తప్పలేదు. సినిమా వాయిదా పడిన విషయాన్ని పద్మావతి సినిమాలో
జలాలుద్దీన్ ఖిల్జీ పాత్ర పోషిస్తున్న వెటరన్ నటుడు రాజా మురద్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

padmavati

కారణం ఏదైనా సినిమా విడుదల వాయిదా పడటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దాదాపు 4000 థియేటర్లను బుక్ చేశామని, సినిమా వాయిదా వల్ల ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. కేవలం డబ్బుతో సినిమా తీయలేదని, ఇందుకోసం ఎంతో కష్టపడ్డామని చెప్పారు. కాగా, సినిమా ఎందుకు వాయిదా వేయాలనుకున్నారనేది కానీ, తదుపరి విడుదల తేదీని కానీ బన్సాలీ, ఆ చిత్ర నటీనటులెవరూ వెల్లడించలేదు. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 1న ‘పద్మావతి’ విడుదల కావాల్సి ఉంది.

- Advertisement -