ఎన్డీయే నుంచి వైదొలగిన శిరోమణి అకాలీ దళ్..

160
akalidal

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ శిరోమణి అకాలీదళ్ నేత హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే మంత్రిపదవికి రాజీనామా చేసిన ఎన్డీయేకు ఇప్పటివరకు మద్దతిచ్చిన ఆ పార్టీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఎన్డీయే కూటమి నుండి వైదొలుగుతున్నట్లు ప్రకటించి మరోబాంబ్ పేల్చింది. వ్యవసాయ బిల్లుపై ఇప్పటికే ఎన్డీయే కూటమిలోని పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న తరుణంలో శిరోమణి అకాలీదళ్ తీసుకున్న నిర్ణయం బీజేపీకి ఇబ్బందికరంగా మారింది.

ఈ నెల 17న కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేశారు హర్‌సిమ్రత్ కౌర్ బాదల్. రాజీనామా చేసిన పది రోజుల తర్వాత ఎన్డీయే నుండి వైదొలిగారు.