షిర్డీ ఆలయం మూత…

285
shirdi temple
- Advertisement -

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుండటం అందరిని ఆందోళన కలిగిస్తుండగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 30.5 లక్షలకు చేరగా యాక్టివ్ ‌కేసుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 56,033కు చేరాయి.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షిర్డీలోని సాయిబాబా ఆలయాన్ని మూసివేస్తూ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆలయం మూసివేసే ఉంటుందని…. సాయిబాబా ఆలయంతో పాటు, ‘ప్రసాదాలయ’, ‘భక్త నివాస్’ కూడా మూసివేయబడతాయని వెల్లడించింది.

మహారాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో పాక్షిక లాక్ డౌన్ ప్రకటించిన క్రమంలో తీవ్రమైన ఆంక్షలు విధించాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం నిర్ణయించింది. ఈ పరిమితులు ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉండనుండగా వారాంతపు లాక్‌ డౌన్లు కూడా రాష్ట్రం అంతా అమల్లోకి రానుంది. ఆ రోజుల్లో 144 సెక్షన్ రోజంతా అమల్లో ఉంటుందని… మామూలు రోజుల్లో కూడా రాత్రి 8 నుంచి ఉదయం 7 గంటల మధ్య సరైన కారణం లేకుండా పౌరులు బయటకు రావొద్దని వెల్లడించింది.

- Advertisement -