శిఖర్ హెచ్చరిక…పంత్ మెల్లగా నడుపు

80
- Advertisement -

టీమిండియా స్టార్ వికెట్‌ కీపర్ రిషబ్ పంత్‌కు మూడేళ్ల క్రితం శిఖర్ ధావన్ హెచ్చరించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ ఆవుతుంది. శుక్రవారం ఉదయం రూర్కీ దగ్గర రిషబ్ పంత్‌ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పంత్ ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.

భారత క్రికెటర్‌ శిఖర్ ధావన్‌కు రిషభ్‌పంత్‌కు మధ్య జరిగిన సంభాషణలో రిషబ్ పంత్‌ ఓవిషయం అడుగుతాడు. తనకు ఏదైనా సూచన చేయాలనుకుంటే చేయవల్సిందిగా కోరతాడు. దీంతో శిఖర్ స్పందిస్తూ బండిని మెల్లగా నడుపు అని సూచన చేయగా…తప్పకుండా సూచనను పాటిస్తా అని అన్నారు. కానీ అంతలోనే ఇలా పంత్ యాక్సిడెంట్‌కు గురికావాల్సి వచ్చింది.

పంత్‌ కారును మెల్లిగా నడిపి ఉంటే ఇవాళ రోడ్డు ప్రమాదానికి గురయ్యేవాడు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ ఆవుతుంది. దీనిపై పలువురు ప్రముఖులు త్వరగా కొలుకోవాలని కొరుకున్నారు.

ఇవి కూడా చదవండి…

రిషబ్ పంత్‌కు తీవ్రగాయాలు..

తల్లి పాడే మోసిన ప్రధాని మోడీ..

గ్రూప్-3లో 1365పోస్టుల భర్తీ

- Advertisement -