ప్రారంభమైన “శిఖండి” షూటింగ్

223
Telugu Actress hebah Patel Angel Movie
- Advertisement -

శ్రీ చర్ల మూవీస్ పతాకం పై చర్ల శ్రీనివాస్ యాదవ్ నిర్మిస్తోన్న చిత్రం “శిఖండి”. పి.రాజారెడ్డి ఈ సినిమాతో దర్శకునిగా తెలుగు చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. నూతన నటీనటులు భరత్, భింభిక నటిస్తోన్న ఈ సినిమా ఎమోషనల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ప్రారంభోత్సవం పఠాన్ చెరువు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో జరిగింది. ప్రముఖ నిర్మాత లయన్ వెంకట్ హీరోయిన్లకు క్లాప్ ఇచ్చి ముహర్తపు సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.

Shikandi Shooting Starts

ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవరు టచ్ చేయని సబ్జెక్ట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని దర్శనిర్మాతలు తెలిపారు.30 రోజులకి పైగా ఈ సినిమా చిత్రీకరణ జరపడానికి చిత్ర బృందం ప్లాన్ చేసింది. హైదరాబాద్ లో టాకీ, కర్ణాటకలోని కూర్గ్, మహాబలేశ్వర్ తదితర లోకేషన్స్ లో సాంగ్స్ షూట్ చేసేందుకు ఈ మూవీ టీమ్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు డి.ఓ.పి – హరీశ్ ఎస్.ఎన్, ఎడిటింగ్ – ఆవుల వెంకటేశ్, సంగీతం – సంజీవ్ మెగోటి.

- Advertisement -