294
Telugu Actress hebah Patel Angel Movie
- Advertisement -

కుమారి 12 ఎఫ్‌ మూవీతో అటు అందాలను ఆరబోస్తు ఇటు ట్యాలెంట్‌ను చూపించిన కుర్ర బ్యూటీ హెబ్బా పటేల్ తాను ట్యాలెంటెడ్ మాత్రమే కాదు క్రౌడ్ పుల్లర్ అని కూడా ప్రూవ్ చేసేసుకుంది. నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ చిత్రానికి కేవలం హెబ్బా బొమ్మ చూసే థియేటర్లకు వచ్చారు జనాలు. ఇప్పుడీ భామ ఏంజెల్ అనే మూవీలో నటిస్తుండగా.. ఇందులో వినవయ్యా రామయ్యా ఫేమ్ నాగ అన్వేష్ హీరోగా నటిస్తున్నాడు.

ఈ మూవీకి సెల్లింగ్ పాయంట్ తానే అని అర్ధం చేసుకున్న హెబ్బా పటేల్.. తన సైడ్ నుంచి కూడా ఫుల్లు సపోర్ట్ ఇస్తున్నట్లే కనిపిస్తోంది. ఏంజెల్ మూవీలో గ్రాఫిక్స్ బోలెడంత ఇంపార్టెన్స్ ఉంటుందట. అందుకే త్వరత్వరగా సినిమా పూర్తి చేసేసి.. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ పై దృష్టి పెట్టామంటున్నాడు దర్శకుడు పళని.

Telugu Actress hebah Patel Angel Movie

ఈ సినిమా ఇప్పటికే చివరి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా.. ఇప్పుడు ప్రచార పోస్టర్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. సోషియా ఫ్యాంటసీ జోనర్ లో తెరకెక్కుతున్న మూవీలో.. హెబ్బా అందాలను బాగానే పెట్టుబడి పెట్టేశారు టీం. హీరో బైక్ తోలుతుంటే.. ఎదురుగా రివర్స్ లో కూర్చోవడం నుంచి.. హెబ్బా స్పీడ్ ను బాగానే ఉపయోగించుకున్నారు. ఇక స్విమ్మింగ్ పూల్ లో అందాలను చూపించే సీన్స్ ను పిక్చరైజ్ చేయడమే కాదు.. వాటిని కూడా ప్రచారం కోసం ఉపయోగించుకోవడం విశేషం.

- Advertisement -