బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా..సైనిక పాలన

12
- Advertisement -

బంగ్లాదేశ్ ఘర్షణల నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆదివారం జరిగిన అల్లర్లలో 100 మందికి పైగా చనిపోగా ఇప్పటివరకు మొత్తంగా 300 మందికి మృతి చెందారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు ప్రధాని షేక్ హసీనా ఇంటిని ముట్టడించడంతో ఆమె రాజీనామా చేసి సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లినట్లు సమాచారం. ఇక ప్రధాని రాజీనామాతో సైనిక పాలన విధించారు.

రాజకీయ పార్టీలతో చర్చలు జరిపారు ఆర్మీ చీఫ్‌. చర్చల తర్వాత బంగ్లాలో సైనిక పాలన విధించినట్లు ఆర్మీ చీఫ్‌ వెల్లడించారు. త్వరలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బంగ్లా ఆర్మీ చీఫ్‌ వెల్లడించారు. దేశంలో కర్ఫ్యూ, అత్యవసర పరిస్థితి విధించాల్సిన అవసరం లేదని..రాత్రిలోపు హింసను ఆపాలని బంగ్లాదేశ్ పౌరులకు ఆర్మీ చీఫ్‌ విజ్ఞప్తి చేశారు. త్వరలో శాంతిని నెలకొల్పుతాం..బంగ్లాదేశ్‌లోని పరిస్థితులపై విచారణ ప్రారంభిస్తాం అని తెలిపారు.

Also Read:రుణమాఫీ అయ్యేదాక నిద్రపోనివ్వం:వివేకానంద

- Advertisement -