రివ్యూ: శేఖర్

343
shekar
- Advertisement -

వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పణలో డా. రాజ‌శేఖ‌ర్ హీరోగా జీవితా రాజశేఖర్ దర్శక‌త్వంలో బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మించిన చిత్రం “శేఖర్”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఇవాళ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకువ‌చ్చింది. ఈ సినిమాతో రాజ‌శేఖ‌ర్ ఏ మేర‌కు ఆక‌ట్టుకున్నాడో చూద్దాం..

క‌థ‌:

శేఖర్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్…క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, క్రైమ్ కేసులు చేధించడంలో నిపుణుడు. ఓ డబుల్ మర్డర్ కేసును ఛేదించడానికి శేఖ‌ర్ సాయం తీసుకుంటారు. ఈ క్ర‌మంలో అత‌డి జ్ఞాపకాలు వెంటాడుతుంటాయి. ఈ క్ర‌మంలో త‌న భార్య చావుకు సంబంధించిన విష‌యాన్ని తెలుసుకుని ఇన్వెస్టిగేష‌న్ మొద‌లు పెడ‌తాడు. సీన్ క‌ట్ చేస్తే….త‌న భార్యను హత్య చేసింది ఎవరు? ,కేసును ఎలా పరిష్కరించాడు అన్న‌దే సినిమా క‌థ‌.

ప్ల‌స్ పాయింట్స్:

సినిమాలో మేజ‌ర్ ప్ల‌స్ పాయింట్స్ రాజ‌శేఖ‌ర్ న‌ట‌న‌,క‌థ‌. త‌న న‌ట‌న‌తో మెప్పించారు రాజ‌శేఖ‌ర్. శేఖ‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయారు. మలయాళ నటి ఆత్మీయ రాజన్ మొదటి సారి తెలుగు సినిమాలో చేసినా ఎక్క‌డా తేడా రానియ‌లేదు. త‌న న‌ట‌న‌తో మెప్పించింది. ఇక మిగితా న‌టీన‌టుల్లో ముస్కాన్ కుబ్చంధాని, అభినవ్ గోమతం, కన్నడ కిషోర్ త‌మ‌ పరిధిమేకరకు బాగానే నటించారు.

మైన‌స్ పాయింట్స్:

సినిమాలో మేజ‌ర్ మైన‌స్ పాయింట్స్ తెలుగు నెటివిటి మిస్స‌వ‌డం.మ‌ల‌యాళ రిమేక్ సినిమాను తెలుగు నెటివిటికి అనుగుణంగా మ‌ల‌చ‌డంపై దృష్టి సారిస్తే బాగుండేది. ఇక రోటిన్ సీన్స్ కూడా బోర్ కొట్టిస్తాయి.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా ప‌ర్వాలేద‌నిపిస్తుంది. సినిమాటోగ్రఫీ మల్లికార్జున్ నారగాని విజ్యువల్స్ పర్వాలేదు. అనూప్ రూబెన్స్ సంగీతం బాగుంది. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

తీర్పు:

ఇన్వెస్టిగేటివ్ సినిమాలు ఎప్పుడూ బోర్ కొట్టవు. కానీ మలయాళ సూపర్‌హిట్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్న‌ప్పుడు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటే బాగుండేది. శేఖర్ పాత్రలో రాజశేఖర్ న‌ట‌న బాగున్నా మిగితా విభాగాల‌పై దృష్టిసారిస్తే బాగుండేది. ఓవ‌రాల్‌గా ఓసారి చూడ‌దగ్గ చిత్రం శేఖర్.

విడుద‌ల తేదీ:20/5/2022
రేటింగ్:2.25/5
న‌టీన‌టులు..రాజ‌శేఖ‌ర్,ఆత్మీయ‌ర
సంగీతం:అనూప్ రూబెన్స్‌
నిర్మాత‌..బీరం సుధాక‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం..జీవితా రాజ‌శేఖ‌ర్

- Advertisement -