విక్రమ్ రైట్స్‌…నితిన్ చేతికి!

94
kamal
- Advertisement -

లోకేష్ కనగ్ రాజ్ పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ విక్రమ్. కమల్ తో పాటు విజయ్ సేతుపతి, మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

పాన్ ఇండియా సినిమాగా వస్తున్న ఈ చిత్రం జూన్ 3న విడుదలకానుండగా ఈ సినిమా తెలుగు హక్కులు హీరో నితిన్ సొంత చేసుకున్నారు. నితిన్ కు శ్రేష్ట్ మూవీస్ నిర్మాణ సంస్థ ఉండగా ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి డిస్టిబ్యూటర్. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా వెల్లడించారు.

టర్మరిక్ మీడియాతో అనుసంధానం ఎంతో ఆనందంగా ఉందని, తెలుగులో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌లో జూన్ 3వ తేదిన గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందని వెల్లడించారు.

- Advertisement -