Bigg Boss 8 Telugu: శేఖర్ బాషా ఎలిమినేట్

12
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో రెండు వారాలు పూర్తి చేసుకుంది. రెండో వారం ఇంటి నుండి శేఖర్ బాషా ఎలిమినేట్ అయ్యారు. అసలు శేఖర్ బాషా ఎలిమినేషన్‌ను ఎవరూ ఉహించలేదు.

ఎలిమినేషన్ సందర్భంగా బిగ్ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ఓటింగ్‌ లీస్ట్‌లో ఆడియన్స్ సెలక్ట్ చేసిన వాళ్లే ఉన్నారు.. కానీ ఈ సీజన్‌లో బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే.. ఓటింగ్‌లో లీస్ట్‌లో ఉన్న ఆ ఇద్దరిలో ఇంట్లో ఎవరుంటారు.. ఇంటి బయటికి ఎవరొస్తారనేది ఈసారి హౌస్‌మెట్స్ డిసైడ్ చేయబోతున్నారు అని తెలిపారు. దీంతో శేఖర్ బాషా, ఆదిత్యల గురించి నాగ్ చెప్పారు.

ఆ తర్వాత వీళ్లలో ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదనేది హౌస్‌మెట్స్ రీజన్ చెప్పి డిసైడ్ చేయాలంటూ నాగ్ అన్నారు. ఈ సందర్భంగా శేఖర్ భార్య డెలివరీ గురించి నాగ్ హింట్ ఇచ్చారు. దీంతో హౌస్‌లోని 11 మంది ఒక్కొక్కరిగా తమ డెసిషన్ చెప్పారు. ఒక్క సీత మినహా మిగిలిన 10 మంది గంపగుత్తగా ఆదిత్య మెడలోనే దండేశారు.

దీంతో ఆదిత్య సేవ్ అవగా హౌస్‌మెంట్స్ నిర్ణయం ప్రకారం శేఖర్ బాషాను ఎలిమినేట్ చేశారు నాగార్జున. ఎలిమినేట్ అవుతున్నాని శేఖర్ చాలా ఆనందపడ్డాడు. ఇది తనకు చాలా అవసరం.. దీన్ని పాజిబుల్ చేసిన మీ అందరికీ థాంక్యూ అని చెప్పాడు శేఖర్. శేఖర్ వెళ్లిపోతున్నాడని సీత, విష్ణుప్రియ ఎమోషనల్ కాగా తాను సంతోషంగా వెళ్తున్నా అని చెప్పాడు శేఖర్.

స్టేజ్ మీదకు వచ్చిన శేఖర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అందరికీ బిడ్డ పుట్టాడని డాక్టర్ లేదా నర్సు చెప్తాడు కానీ నాకు కింగ్ నాగార్జున చెప్పారు అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. హౌస్‌లో ముగ్గురు ఫేక్, ముగ్గురు రియల్ పర్సన్స్ గురించి చెప్పమనగా సీత, విష్ణుప్రియ, ప్రేరణ రియల్ అని చెప్పాడు. . వీళ్లు ముగ్గురు చూలా ఫెయిర్, ఉన్నది ఉన్నట్లుగా హార్ట్ నుంచి మాట్లాడతారు అని చెప్పారు.

Also Read:Bigg Boss 8 Telugu: కంటతడి పెట్టించిన బిగ్ బాస్..

ఫేక్ పర్సన్స్ ఎవరూ అంటే మొదటిగా సోనియా పేరు చెప్పాడు శేఖర్. సింపుల్‌గా చెప్పాలంటే ఆమెలో ఇద్దరు సోనియాలు ఉన్నారని తెలిపాడు. ఆ తర్వాత మణికంఠ కూడా ఫేక్ అని చెప్పాడు. ఎమోషన్స్‌ను కూడా ఎక్కడ చూపిస్తే మనకి గెయిన్ అవుతుంది.. ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా ఉంటే మనకి యూజ్ అవుతుంది అనే ఆలోచనతో చూపించాల్సిన చోట ఎమోషన్స్ చూపించకుండా.. అవసరం లేని చోట చూపిస్తూ చాలా కాలుక్యులేటెడ్‌గా ఉంటాడు అని చెప్పాడు. తర్వాత ఆదిత్య బొమ్మ పెడుతూ ఆయన నన్ను మూడు సార్లు నామినేట్ చేశాడు.. తిరిగి నేను ఒక్కసారి నామినేట్ చేస్తేనే ఫేస్ మారిపోయింది అన్నాడు.

- Advertisement -