క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్‌లో అమ్మాయిలు పడుకుంటేనే అవకాశాలు వస్తాయని సంచలన వ్యాఖ్యలు చేసి శ్రీరెడ్డి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ వేదికగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై సంచలన ఆరోపణలు చేసింది. దీనిపై ఘాటుగా స్పందించాడు శేఖర్ కమ్ముల.
పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. స్త్రీ ల సమానత్వం, సాధికారతని నేను ఎంత నమ్ముతానో నా సినిమాలు, నా కార్యక్రమాలు చూస్తే అర్ధమౌతుంది. నా వ్యక్తిత్వం, నమ్మే విలువలు నా ప్రాణం కంటే ముఖ్యం. వాటి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే, వదిలి పెట్టే ప్రసక్తి లేదని తెలిపిన శేఖర్..ఆమె చేసిన ఆరోపణలు తప్పు అని ఒప్పుకొని, క్షమాపణ చెప్పకపోతే, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు.
ఆ పోస్ట్ లో ప్రతీ మాట అబద్ధం. అసభ్యం. అవమానకరం. నా కుటుంబానికి, నన్ను గౌరవించేవారికి చాలా మనస్థాపం కలిగించిందని తెలిపారు. అసలు తానెప్పుడు శ్రీరెడ్డిని కలవలేదని…కనీసం ఫోన్లో కూడా మాట్లాడని అమ్మాయి…ఆధారం లేని ఆరోపణలు చేయడం షాకింగ్‌గా ఉందన్నారు. వారు ఏ ఉద్దేశంతో ఆరోపణలు చేశారో కానీ..ఇది తప్పు,నేరం అంటూ హెచ్చరించారు.