నగరాన్ని ప్రేమిస్తే..ఓటు వేయండి:శేఖర్ కమ్ముల

180
shekar
- Advertisement -

హైదరాబాద్ మహానగర పాలక సంస్ధ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతిసారి ఓటింగ్‌కి మెజార్టీ హైదరాబాద్ ప్రజలు దూరంగా ఉంటుండగా పోలింగ్ శాతం పెంచేందుకు ప్రభుత్వంతో పాటు సెలబ్రెటీలు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

తాజాగా జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ఓటింగ్ శాతం పెంచేందుకు టాలీవుడ్ సెలబ్రెటీలు నడుం బిగించారు. ఇప్పటికే ఉదయభాను ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ప్రయత్నించగా తాజాగా దర్శకుడు శేఖర్ కమ్ముల ముందుకొచ్చారు. మన నగరాన్ని నిజంగా ప్రేమిస్తే.. మనం తప్పకుండా డిసెంబరు 1 వతేదీన తప్పకుండా ఓటు వేయాలని ఆయన కోరారు.

మరికొంతమంది ప్రముఖులు కూడా సోషల్‌ మీడియాలో ఓటు హక్కు వినియోగంపై ఉత్సాహాన్ని రేకెత్తించేలా విడియోలను పోస్ట్‌ చేస్తున్నారు. నగర వాసుల్లో ఓటు హక్కు వినియోగం శాతం పెంచేలా చైతన్యాన్ని కలిగిస్తున్నారు.

- Advertisement -