ఛానల్‌ వాళ్లే అలా చెప్పమన్నారు !

175
she asked him to say that so they could cut promo
she asked him to say that so they could cut promo
- Advertisement -

కొద్ది రోజులుగా టాలీవుడ్ ను డ్రగ్స్ కేసు కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. చాలా వరకు డ్రగ్స్ విదేశాల నుండి పార్శల్స్ రూపంలో వస్తున్నాయని గ్రహించిన అధికారులు నిఘా పెట్టారు. ఇటీవల రామానాయుడు స్టూడియోకి విదేశాల నుండి హీరో రానా పేరు మీద పార్సిల్ రావడంతో ఎక్సైజ్ శాఖ సీఐ పరిశీలించేందుకు వెల్లడం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ‘నేను రాజు నేనే మంత్రి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో పాల్గొన్న రానాకు డ్రగ్స్ కేసు, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శిల్‌కు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. డ్రగ్స్ వ్యవహారం గురించి, రామానాయుడు స్టూడియోకు వచ్చిన పార్శల్ గురించి అడగ్గానే రానా… ఆగ్రహంతో ఊగిపోయారు. పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయద్దంటూ యాంకర్ మీద అరిచాడు. తనను తాను కంట్రోల్ చేసుకోలేని స్థితిలో కోపంతో చూస్తూ, యాంకర్ పై చిటికలు వేస్తూ, ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయవద్దని సీరియస్ గా ఆయన వార్నింగ్ ఇవ్వడంతో యాంకర్ బిత్తర చూపులు చూడగా, రానాకు అంత ఆగ్రహం ఎందుకని నెటిజన్లు ప్రశ్నించారు కూడా.

Rana tweet

అయితే, ఈ వీడియో అంతా ఫేక్ అని, ప్రోమో కట్ కోసం యాంకర్ చెప్పినట్టుగా తాను చేశానని రానా స్వయంగా అంగీకరించాడు. “సార్, మీరు నిజంగానే ఆ ఛానల్‌ యాంకర్ పై ఆగ్రహాన్ని చూపారా? లేక అది పబ్లిసిటీ కోసమా?” అని ఓ అభిమాని ప్రశ్నించగా, “ఆమే అలా చెప్పాలని సూచించింది. ప్రోమో కట్ కోసమే ఇదంతా” అని రానా సమాధానం ఇచ్చాడు. ఇటీవల ధనుష్‌ను తన ఫ్యామిలీకి సంబంధించిన ప్రశ్నలు అడగ్గానే.. ఆయన ఇదే రకం కోపం చూపించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ధనుష్‌ కూడా స్టూడియో నుంచి లేచి వెళ్లిపోవడం కూడా కావాలనే చేసినట్టు తెలుస్తోంది. వివాదం లేనిదే ఎవరూ తమ పోగ్రామ్ లు చూడరని ఛానెల్స్ వాళ్లు ఆలోచిస్తున్నట్లున్నారు. కంటెంట్ లో వివాదం లేకపోతే వివాదం వచ్చేలా కంటెంట్ ని రెడీ చేస్తున్నారు. ఆ మేరకు ప్రోమోలు కట్ చేస్తున్నారు.

- Advertisement -