దక్షిణాఫ్రికా క్రికెట్ టీమ్‌పై ఆజట్టు మాజీ క్రికెటర్ షాన్ పోలాక్ ప్రశంసలు గుప్పించారు. మొత్తం సిరీస్‌లో తమ జట్టు అసాధారణ ప్రదర్శన కనబరుస్తోందని ప్రశంసించారు.
భారత్‌ను ఫాలో-ఆన్ ఇవ్వకపోవడానికి ఒకే కారణం, వారికి ఒక లక్ష్యాన్ని నిర్ధేశించాల్సి రావడం. 450 పరుగులను భారత్ ఛేదిస్తే, ఇప్పటివరకు చూశిన దృష్ట్యా నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మొత్తం దృష్టి WTC పాయింట్లపైనే ఉంది. ఈ పర్యటనకు రాకముందే, ‘భారత్ పర్యటనలో 24 పాయింట్లు సంపాదిస్తారు’ అని ఎవరైనా చెప్పి ఉంటే, దక్షిణాఫ్రికా ఆనందంతో ఎగిరిపోయేది అని చెప్పారు.
దక్షిణాఫ్రికా ఫామ్ ఇలానే కొనసాగుతుందనే నమ్మకం వ్యక్తం చేశారు దక్షిణాఫ్రికా జట్టు టెస్ట్ ఫార్మాట్లో అద్భుత ఫామ్‌లో ఉందని, ఈ సిరీస్ తర్వాత శ్రీలంక పర్యటనలో కూడా మంచి ప్రదర్శన ఇవ్వగలదని పోలాక్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా గత WTC ఫైనల్ తరువాత..వాళ్లు ఎవరిని ఓడించారు? ఎక్కడ ఆడారు? అన్న ప్రశ్నలు వచ్చాయి. ఇప్పుడు చూడండి — పాకిస్తాన్‌కి వెళ్లి సిరీస్ డ్రా చేస్తారు, భారత్‌కి వచ్చి రెండు విజయాలు సాధిస్తారు (అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే). తర్వాత శ్రీలంకకు వెళ్లి కూడా మంచి ప్రదర్శన ఇవ్వగలరు. ఇది ఎంతో పెద్ద విషయం అవుతుంది అని పోలాక్ అన్నారు.
Also Read:చికిరి చికిరి@ 100 మిలియన్ వ్యూస్

