భారత్‌లో హింసకు తావులేదు!

3
- Advertisement -

బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న అశాంతిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని ప్రభుత్వం పరిస్థితిని అదుపులోకి తేవాల్సిన బాధ్యత ఉందని ఆయన అన్నారు. చట్టరహిత పరిస్థితులు, భయభ్రాంతుల మధ్య ఎన్నికలు జరగలేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఓటర్లు సురక్షితంగా ఉన్నామనే భావనలో లేరని థరూర్ పేర్కొన్నారు.

బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్ హత్యను ఖండించిన శశి థరూర్, భారత్‌లో కూడా నిరసనలు జరుగుతాయని కానీ ఇక్కడ ఎవరినీ ‘లించ్’ చేయరని అన్నారు. రాడికల్ యాంటీ-ఇండియా విద్యార్థి నేత షరీఫ్ ఒస్మాన్ హాది హత్య అనంతరం బంగ్లాదేశ్‌లో చెలరేగిన అశాంతిని ఆయన ప్రస్తావించారు. ఏదైనా హింసకు ప్రయత్నిస్తే భారత్‌లో పోలీసులు కఠినంగా అణచివేస్తారని చెప్పారు.

సరిహద్దు అవతల ఇంత అస్థిర వాతావరణం ఉంటే, భారత్‌లో కూడా కొన్ని వర్గాలు ప్రతిస్పందనగా నిరసనలు నిర్వహించడం ఆశ్చర్యం కాదు. ప్రజాస్వామ్యంలో వారికి ఆ హక్కు ఉంది. కానీ ఇవి అదుపు తప్పాయని ఎవరికీ అనిపించలేదు. ఇక్కడ హింస లేదు, లించింగ్ లేదు. ఎలాంటి హింసకు ప్రయత్నించినా పోలీసులు తప్పకుండా అణచివేస్తారు. అదే విధంగా బంగ్లాదేశ్‌లోనూ జరగాలని మేం కోరుకుంటున్నాం అన్నారు.

ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శాంతియుత వాతావరణం అవసరమని థరూర్ చెప్పారు. అక్రమ వలసదారులు దేశంలోకి వస్తే అది మన వైఫల్యం కాదా? సరిహద్దులను మరింత కట్టుదిట్టంగా నియంత్రించాల్సిన అవసరం లేదా? అని ఆయన ప్రశ్నించారు.

Also Read:Modi:క్రిస్మస్ వేడుకల్లో మోదీ

 

- Advertisement -