ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ఎన్నికల రేసు ప్రారంభమైంది. రేసులో సీనియర్ నేత, ఎంపీ శశి థరూర్ జాయిన్ అయ్యారు. ఇటీవల మలయాళ దినపత్రిక ‘మాతృభూమి’కి రాసిన కథనంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం పార్టీకి చాలా అవసరం అని తెలిపిన సంగతి తెలిసిందే. పార్టీ నేతలు దీపెందర్ హూడా, జై ప్రకాష్ అగర్వాల్, విజేంద్ర సింగ్‌లు సోనియా గాంధీని కలిశారు. తాను కూడా రేసులో ఉన్నానని తెలపగా సోనియా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
అయితే గతంలో కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలంటూ సోనియాకు లేఖ రాసిన జీ-23లో శశి థరూర్ లేరు. అయితే ఎవరైనా పోటీ చేయవచ్చని తీర్మానించిన నేపథ్యంలో ఆయన పోటీ చేసేందుకు సుముఖత చూపించారు.
ఇక ఈ రేసులో రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ ఉన్నారనే కొద్ది రోజుల క్రితం పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన తప్పుకోగా తాజాగా శశి థరూర్ పేరు తెరపైకి వచ్చింది.