ఇప్పుడున్న యంగ్ హీరోల్లో విభిన్నమైన .. విలక్షణమైన కథలకు ఇంపార్టెంట్ ఇచ్చే హీరో శర్వానంద్ . కథల విషయంలో ఆచితూచి వ్యవహరించడంల వల్లే శర్వా సక్సెస్‌ల బాట పట్టాడు. హీరోగా నిలదొక్కుకోవడానికి కూడా ఇదే కారణం.
అయితే ఇప్పుడు శర్వానంద్ మరింత కొత్తగా ఆలోచిస్తున్నాడు. కొంతమంది రైటర్లను ఒక టీమ్ గా ఏర్పాటు చేసి వారికి వైవిధ్యభరితమైన కొత్త కథలను రూపొందించే పనిని శర్వా అప్పగించినట్టు టాక్.

అలా రైటర్స్ రెడీ చేసిన కొత్త కథలతో శర్వానంద్ ఒక స్టోరీ బ్యాంక్ ను ఏర్పాటు చేస్తాడట. తనతో సినిమా చేయాలనుకున్న వారికి ముందుగా తన దగ్గరున్న కథలను వినిపించి, వాళ్లకి నచ్చితే సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యం అన్నట్టుగా ఆయన రెడీ అవుతున్నాడని అంటున్నారు.
ఈ విధంగా చేయడం వలన కథలపై తనకి పూర్తి అవగాహన ఉండటమే కాకుండా .. ప్రాజెక్టుల విషయంలో ఆలస్యం కాకుండా ఉంటుందని భావిస్తున్నాడట.

