బన్ని’డిజె’ దుమ్ములేపింది..!

285
duvvada jagannatham movie 10crores views in online
- Advertisement -

డిజె (దువ్వాడ జగన్నాథమ్)… హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ ని కుదిపేసింది. మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్ వచ్చినా వసూళ్ల పరంగా మాత్రం సత్తా చాటింది.

బన్నీ కెరీర్‌లో మరో హయ్యస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిన ఈ సినిమా హిందీ డబ్బింగ్‌ వర్షన్‌ ఆన్‌లైన్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. గోల్డ్‌ మైన్స్ టెలీఫిలింస్‌ యూట్యూబ్‌ చానల్‌లో ఉన్న డిజె హిందీ డబ్బింగ్‌ సినిమా 71 రోజుల్లో ఏకంగా పది కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది.

duvvada jagannatham movie 10crores views in online

50 కోట్ల బడ్జెట్‌ తో దిల్‌ రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగులో వందకోట్లకు పైగా వసూళ్లు సాదించినట్టుగా చిత్రయూనిట్‌ వెల్లడించారు. తాజాగా హిందీ వర్షన్‌ పది కోట్లకు పైగా వ్యూస్‌ సాధించటంపై స్పందించిన చిత్ర దర్శకుడు హరీష్ శంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

ఇక ఈ సినిమాలో బన్నీ బ్రహ్మాణుడిగా నటించగా..పూజ హెగ్డే హీరోయిన్‌ గా అలరించింది. విలక్షణ నటుడు రావూ రమేష్‌ విలన్‌ గా అందరినీ మెప్పించాడు.

- Advertisement -