కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన త్రివిక్రమ్ శ్రీనివాస్

498
Trivikram Meet naresh
- Advertisement -

ప్రముఖ దర్శకురాలు, నటి విజయనిర్మల మృతికి చింతిస్తూ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీని పరామర్శించారు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్. శనివారం ఉదయం కృష్ణ గారిని కలిసి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలుగు చిత్రసీమలో విజయనిర్మల గారి స్థానం భర్తీ చేయలేనిదన్నారు.

త్రివిక్రమ్ అక్కడ ఉండగానే మహేశ్ బాబు, నరేశ్ వచ్చారు. వారిద్దరితోనూ త్రివిక్రమ్ మాట్లాడి ఓదార్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మహేష్ బాబు కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. మహేష్ కెరీర్లో ఒక బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్. అతడు సినిమాలో మహేష్ బాబును కొత్తగా చూపించారు.

- Advertisement -