లుంగీ లుక్‌లో ఆకట్టుకుంటున్న శర్వా..!

471
- Advertisement -

శర్వానంద్ త్వరలో ‘జాను’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో సెన్షేషనల్ సక్సెస్ క్రియేట్‌ చేసిన 96 చిత్రాన్ని తెలుగులో జానుగా రీమేక్ చేశారు. అక్కడ విజయ్ సేతుపతి చేసిన పాత్రను ఇక్కడ శర్వానంద్ చేసిన విషయం తెల్సిందే. శర్వా అటు జాను విడుదలకు సిద్దం అవుతుండగానే ఇటు శ్రీకారం అనే మరో చిత్రంతో బిజీగా ఉన్నాడు. శర్వా చేస్తున్న ‘శ్రీకారం’ కూడా సెట్స్ పైనే వుంది. రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిసున్న ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కిషోర్ రెడ్డి పరిచయమవుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది.

తాజాగా ఈ సినిమా నుంచి శర్వానంద్ ఫస్టులుక్ విడుదల చేశారు చిత్ర బృందం. లుంగీ పైకి కట్టి .. భుజం పై నల్ల తువ్వాలు వేసుకుని పొలం పనుల్లో వున్నట్టుగా ఈ పోస్టర్‌లో శర్వానంద్ కనిపిస్తున్నాడు. ఇందులో కథానాయికగా ప్రియాంక అరుళ్ మోహన్ పేరు వినిపిస్తోంది. మిక్కీ జె.మేయర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు. కాగా శర్వానంద్‌ ‘శతమానం భవతి’ తరువాత పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో చేస్తున్న చిత్రం కావడం విశేషం.

Sharwanand

- Advertisement -