శర్వానంద్ ‘రాధ’ ట్రైలర్ టాక్

233
Sharwanand's Radha Movie Teaser
- Advertisement -

వరుస విజయాలతో దూసుకుపోతోన్న యువ నటుడు శర్వానంద్. శతమానంభవతి సినిమా హిట్‌తో మంచి దూకుడు మీదున్న ఈ కుర్రహీరో తన నెక్ట్స్‌ సినిమా సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాధ అనే టైటిల్‌ను ఖరారు చేస్తు శివరాత్రి సందర్భంగా చిత్రయూనిట్ పోస్టర్‌ని విడుదల చేసింది. ఖాకీ గెటప్.. నెత్తిన కిరీటం.. చేతిలో ఫ్లూటు.. చూస్తుంటే ఖాకీ డ్రస్సు వేసుకున్న కృష్ణుడిలా అదరగొట్టాడు శర్వానంద్. తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌తో ఆకట్టుకున్నాడు శర్వానంద్.

ఇప్పటివరకు మనం చూసిన పోలీస్ సినిమాల టైపులో ఇది కూడా ఒక స్టయిలిష్ కాప్ ఎంటర్టయినర్ అనే చెప్పాలి. ముఖ్యంగా శర్వానంద్ తన బాడీ లాంగ్వేజ్ తో అదరగొట్టేశాడు. ఆ కాలంలో కృష్ణుడు.. ఈ కాలంలో పోలీసోడు దుష్టసంహారణార్దం అవతరిస్తాడని  శర్వానంద్ చెప్పిన డైలాగ్ బాగుంది . ఇక టీజర్ చివర్లో.. ”నీకు శ్లోకం కావాలా? సారాంశం కావాలా?” అంటూ మనోడు తనదైన స్లాంగులో అడిగే తీరు అదరగొట్టేసింది. ఇక టీజర్లో సరదాగా అలా తళుక్కుమన్న లావణ్య.. గ్లామర్ తో అదరగొట్టేసింది.

https://youtu.be/ldtEwgo3Vgs

- Advertisement -