పవన్‌..ఓటమి బాధ నుంచి ఇలా..!

424
pawan
- Advertisement -

ఓటమి బాధ నుంచి ఎలా బయటపడాలో నాయకులకు హీతబోధ చేస్తున్నారు పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్. ఓ వైపు వరుసగా పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తూనే మరోవైపు తన సహజశైలీకి దగ్గరగా పార్టీ కార్యాలయంలో పెంచుతున్న గోవులతో కాలక్షేపం చేస్తున్నారు పవన్‌.

పార్టీ కార్యాలయంలో పెంచుతున్న గోవులకు నమస్కరించి వాటి ఆలనాపాలన గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఓ ఆవు లేగ దూడకు జన్మనివ్వగా.. దాని దగ్గరకు వెళ్లిన పవన్.. దూడతో కాసేపు కాలక్షేపం చేశారు. అనంతరం కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు.

ఇక మంగళవారం నుంచి జనసేన పార్టీ కమిటీల నిర్మాణం, ప్రజా సంబంధిత కార్యక్రమాల నిర్వహణపై నాయకులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించి ఏర్పాటైన కమిటీ సమగ్రంగా అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించి ప్రజలకు బాసటగా నిలుద్దామన్నారు. ఇందుకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు.

- Advertisement -