అలాంటి అపవాదను మార్చేస్తా…

182
i can change that...samantha
- Advertisement -

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు తమిళ చిత్రాల్లో నటిస్తూ వరుస విజయాలను అందుకుంటోంది అక్కినేని సమంత.
ఇటీవల విడుదలైన ‘మహానటి’ చిత్రంలో మధురవాణి పాత్రలో జర్నలిస్టుగా నటించి తన నటనతో మరోసారి ఆకట్టుకుంది. హైట్రిక్ హిట్లతో పెళ్లైన తర్వాత కూడా తన జోరును కొనసాగిస్తోంది.

 i can change that..samantha

గతంలో ‘రంగస్థలం’ సినిమాతో తన నటనకు మంచి మార్కులే సంపాదించుకుంది. కాగా తమిళంలో విశాల్ సరసన నటించిన చిత్రం ‘ఇరుంబు తిరై’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా తమిళ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది సమంత. ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించింది.

ముఖ్యంగా నేను కొత్త దర్శకుల సినిమాలను ఎక్కువగా ఒప్పుకోనని కానీ ఈ సినిమా దర్శకుడు మిత్రన్ సినిమా చేసిన తర్వాత నా అభిప్రాయం తప్పనిపించిందని తెలిపింది. ఇక పెళ్లైన తర్వాత హీరోయిన్‌లకు సరైన అవకాశాలు రావన్నది సత్యం. కానీ నేను అలాంటి అపవాదను మార్చేందుకు ప్రయత్నిస్తున్నానని పేర్కొంది సమంత. ఇక ఈ సినిమా తెలుగులో ‘అభిమన్యుడు’గా రానుంది. ప్రస్తుతం ఆమె యూ టర్న్, సూపర్‌డీలక్స్ చిత్రాల్లో నటిస్తుంది.

- Advertisement -