రామ్ చరణ్ కి తోడల్లుడు కాబోతున్న శర్వానంద్‌..

543
Sharwanand to Marry upasana's Cousin Sister
Sharwanand to Marry upasana's Cousin Sister
- Advertisement -

రామ్ చరణ్ కు శర్వానంద్ చిన్న నాటి స్నేహితుడన్న సంగతి చాలామందికి తెలియదు. అప్పట్లో ‘ఎక్స్ ప్రెస్ రాజా’ విడుదల నేపథ్యంలో దాని గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడి.. ఆల్ ద బెస్ట్ చెప్పడానికి శర్వాతో చెర్రీకి ఉన్న ఫ్రెండ్షిప్పే కారణం. షాకింగ్ న్యూస్ ఏంటంటే.. శర్వ.. మెగా హీరో రామ్ చరణ్ కి తోడల్లుడు కాబోతున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ వైఫ్ ఉపసాన సిస్టర్ ను శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నాడట. అపోలో వ్య‌వ‌స్థాప‌కులు, సీసీ రెడ్డి మ‌న‌వ‌రాలిని రామ్‌చ‌ర‌ణ్ వివాహం చేసుకున్నారు. ఉపాస‌నకు ఇద్ద‌రు సిస్టర్స్ ఉన్నారు. వారిలో ఒక‌రిని శ‌ర్వానంద్‌కి ఇచ్చి వివాహం చెయ్యాలని కామినేని కుటుంబం భావిస్తోందట. ఇప్ప‌టికే, దీనికి సంబంధించి అన్ని వైపుల నుంచి పెద్ద‌లు మాట్లాడుకోవ‌డం కూడా జ‌రిగింద‌ని, త్వ‌రలోనే ఓ మాట ద్వారా ఫైన‌లైజ్ చెయ్య‌డ‌మే అని తెలుస్తోంది.

upasana

అయితే ఈ వార్తలన్నీ బయట వినిపిస్తున్నాయి గానీ రెండువైపులలో ఎవరూ ధృవీకరించటం అయితే జరగలేదు. శ‌ర్వానంద్‌ కుటుంబం స్వస్థలం విజ‌య‌వాడ‌. ఆయ‌నకు మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంద‌ని స‌మాచారం. ఆర్థికంగా వారి కుటుంబం బాగా సెటిల‌యింద‌ని, శ‌ర్వానంద్ తండ్రి మంచి పేరున్న వ్యాపారవేత్త అని ఈ మ్యారేజ్‌కి ఓకే చేసిన‌ట్లు తెలుస్తోంది. శ‌ర్వానంద్ మ్యారేజ్‌కి రామ్‌చ‌ర‌ణ్ రిక‌మండేష‌న్ కూడా ఉండ‌నే ఉంది. ఇంకేముంది.. దాదాపు ఈ ఇద్ద‌రూ ఇక కో బ్ర‌ద‌ర్స్‌కావ‌డ‌మే మిగిలి ఉంది అనే రేంజ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ వార్త‌లో నిజ‌మెంత అనేది త్వ‌ర‌లోనే తేల‌నుంది.

- Advertisement -