హీరో శర్వానంద్‌కు తీవ్ర గాయాలు..!

426
sharwanand
- Advertisement -

ఈమధ్య తెలుగు హీరోలు వరుసగా గాయాల పాలవుతున్నారు. తమ అభిమాన హీరోలు గాయపడటం అభిమానుల్ని కలవరపెడుతుంది. మొన్న వరుణ్ తేజ్, నిన్న సందీప్ కిషన్, నేడు శర్వానంద్ ఇలా హీరోల రోజుకు ఒకరికి చొప్పున గాయాలవుతున్నాయి. ఈఘటన ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. శర్వానంద్ ప్రస్తుతం 96మూవీలో నటిస్తున్నారు.

బ్యాంకాంక్ లో జరుగుతున్న ఈఘూటింగ్ లో పాల్గోన్న శర్వానంద్, ఓ రిస్కీ షాట్ ను డూప్ లేకుండా చేస్తూ ప్రమాదానికి గురయ్యాడు. సినిమాలో స్కై డైవింగ్ షాట్ ఉండగా, దాన్ని చేస్తూ ప్రమాదవశాత్తూ కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్రగాయాలు కాగా, యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. శర్వానంద్ భుజానికి, కాలికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. శర్వానంద్ ప్రస్తుతం హైదరబాద్ లో చికిత్స తీసుకుంటున్నాడు.

- Advertisement -