శర్వానంద్- సమంత ’96’ గ్రాండ్ లాంచ్..

258
Sharwanand
- Advertisement -

శర్వానంద్, సమంత హీరో హీరోయిన్లుగా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మాణంలో కొత్త చిత్రం ఉగాది సందర్భంగా హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. సి.ప్రేమ్ కుమార్ దర్శకుడు. తమిళంలో విజయవంతమైన 96 చిత్రానికి ఇది తెలుగు రీమేక్ గా తెరకెక్కనుంది.

ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ – మా వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో ఎన్నో ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ రూపొందాయి. వాటికి ప్రేక్షకుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ కూడా లభించిన సంగతి తెలిసిందే. అదే కోవలో ఇప్పుడు ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాం. తమిళంలో విజయవంతమైన `96` చిత్రాన్ని తెలుగులో రీమేక్ గా ఈ సినిమా రూపొందుతుంది. శర్వానంద్, సమంత హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. తమిళంలో సినిమాను డైరెక్ట్ చేసిన సి.ప్రేమ్ కుమార్ తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ నెల ద్వితీయార్థంలో చిత్రీకరణను ప్రారంభిస్తాం. ముందు 15 రోజుల పాటు కెన్యాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. తర్వాత హైదరాబాద్, వైజాగ్ ప్రాంతాల్లో జూలై వరకు చిత్రీకరణను పూర్తి చేస్తాం అన్నారు.

శర్వానంద్, సమంత హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజనేయులు, రచన: మిర్చి కిరణ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, సంగీతం: గోవింద్ వసంత, కెమెరా: జె.మహేంద్రన్, నిర్మాణం: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, దర్శకత్వం: సి.ప్రేమ్ కుమార్.

- Advertisement -