యదార్థగాథగా “పలాస 1978”..

777
Palasa 1978
- Advertisement -

అభ్యుదయ భావాలతో, ప్రేక్షకుడిని ఆలోచింప జేసే చిత్రాలు నిర్మించే తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లండన్ బాబులు ఫేమ్ రక్షిత్ హీరోగా నటిస్తున్న చిత్రం “పలాస 1978”.. నక్షత్ర హీరోయిన్ గా యదార్థ గాథ గా రాబోతున్న ఈ సినిమాని బిక్రమ్ కృష్ణ ఫిలింస్ పతాకంపై అట్లూరి వరప్రసాద్, అప్పారావు బెల్లన నిర్మిస్తున్నారు. పలు చిత్రాలకు రచన, దర్శకత్వ విభాగంలో పనిచేసిన కరుణ కుమార్ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

రఘు కుంచె సంగీతాన్ని, విన్సెంట్ అరుల్ సినిమాటోగ్రఫీని సమకూరుస్తున్నారు. ప్రముఖ గీతరచయితలు భాస్కరభట్ల,సుద్దాల అశోక్ తేజ, లక్ష్మి భూపాల్ లు ఈ సినిమా కి సాహిత్యం అందించడం విశేషం. కాగా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా, షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను శెరవేగంగా జరుపుకుంటుంది..

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ” గతవారమే సినిమా షూటింగ్ పూర్తయ్యింది.. ఏప్రిల్ నెలాఖరులో టీజర్ రిలీజ్ చేసి, మే మొదటి వారంలో పాటలు, ట్రైలర్ ని రిలీజ్ చేస్తామన్నారు.. మే చివరి వారం లో సినిమా విడుదల కు సన్నాహాలు ప్రారంభించాం” అన్నారు. నటీనటులు: రక్షిత్, నక్షత్ర, రఘుకుంచె, జనార్దన్, మిర్చి మాధవి, కంచరపాలెం రాజు, మీసాల లక్ష్మణ్, తదితరులు..

- Advertisement -