శర్వానంద్ హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మాతలుగా శ్రీకార్తీక్ దర్శకత్వంలో కొత్త చిత్రం ఈరోజు చెన్నైలో లాంఛనంగా ప్రారంభమైంది. షూటింగ్ కూడా నేటి నుండే ప్రారంభమవుతుంది. ఈ చిత్రంలో `పెళ్ళిచూపులు` ఫేమ్ రీతూవర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. నాజర్, వెన్నెలకిషోర్, ప్రియదర్శి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విడదీయలేని స్నేహం, ప్రేమ అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెకకనుంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నారు. జాక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సుజిత్ సారంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
నటీనటులు:శర్వానంద్, రీతూవర్మ, నాజర్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి తదితరులు,సాంకేతిక వర్గం:దర్శకత్వం: శ్రీకార్తీక్,నిర్మాతలు: ఎస్.ఆర్.ప్రకాశ్ బాబు, ఎస్.ఆర్.ప్రభు,బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్,డైలాగ్స్: తరుణ్ భాస్కర్,మ్యూజిక్: జాక్స్ బిజోయ్,సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్,ఎడిటర్: శ్రీజిత్ సారంగ్,ప్రొడక్షన్ డిజైనర్: ఎన్.సతీశ్ కుమార్,కాస్ట్యూమ్స్ స్టైలిస్ట్ :పల్లవి సింగ్