తిరుప‌తిలో శ‌ర్వానంద్‌…. ‘శ్రీ‌కారం’

423
srikaram
- Advertisement -

శ‌ర్వానంద్ హీరోగా న‌టిస్తోన్న ‘శ్రీ‌కారం’ చిత్రం షూటింగ్ తిరుప‌తిలో గురువారం పునఃప్రారంభ‌మైంది. షూటింగ్ స్పాట్ నుంచి రెండు ఫొటోల‌ను షేర్ చేసిన నిర్మాత‌లు “ఇలా మొద‌లైంది.. ఇలా జ‌రుగుతోంది” అంటూ ట్వీట్ చేశారు. మొద‌టి ఫొటోలో ఖాళీ నేల‌పై ఉన్న కెమెరా ఎక్విప్‌మెంట్‌.. రెండో ఫొటోలో ప‌చ్చ‌టి పొలాల మ‌ధ్య క‌నిపిస్తోంది. సింబాలిక్‌గా ఆ పిక్చ‌ర్ల‌ను నిర్మాత‌లు షేర్ చేశారు.

హీరో హీరోయిన్లు శ‌ర్వానంద్‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్‌తో పాటు సీనియ‌ర్‌ న‌రేష్, మ‌రికొంద‌రు న‌టులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు.ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను కిశోర్ బి. డైరెక్ట్ చేస్తుండ‌గా, 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపి ఆచంట నిర్మిస్తున్నారు.శ్రీ‌కారం చిత్రానికి మిక్కీ జె. మేయ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయిమాధ‌వ్ బుర్రా సంభాష‌ణ‌లు రాస్తున్నారు. జె. యువ‌రాజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా,అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

తారాగ‌ణం:
శ‌ర్వానంద్‌, ప్రియాంక అరుళ్ మోహ‌న్‌, రావు ర‌మేష్‌, ఆమ‌ని, సీనియ‌ర్ న‌రేష్‌, సాయికుమార్‌, ముర‌ళీశ‌ర్మ‌, స‌త్యా, స‌ప్త‌గిరి

సాంకేతిక బృందం:
నిర్మాత‌లు: రామ్ ఆచంట‌, గోపి ఆచంట‌
ద‌ర్శ‌కుడు: కిశోర్ బి.
మ్యూజిక్‌: మిక్కీ జె. మేయ‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: జె. యువ‌రాజ్‌
డైలాగ్స్‌: సాయిమాధ‌వ్ బుర్రా
ఆర్ట్‌: అవినాష్ కొల్లా
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె. వెంక‌టేష్‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: హ‌రీష్ క‌ట్టా
పీఆర్వో: వ‌ంశీ-శేఖ‌ర్‌

- Advertisement -