మరోసారి రిస్క్ చేస్తున్న శర్వా….

263
Sharwanand on Dussara Race
- Advertisement -

శతమానంభవతి అందించిన జోష్‌తో మంచి ఉపుమీదున్నాడు హీరో శర్వానంద్. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో శర్వానంద్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మహానుభావుడు.  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంను  దసరాకు రిలీజ్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తోంది.

తనదైన స్టైల్లో ప్రేక్షకులను మెప్పిస్తున్న శర్వానంద్….మరోసారి రిస్క్ చేసేందుకు సిద్దమయ్యాడు.  గతంలో మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’, బాలకృష్ణ ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలతో ఢికోని ‘శతమానం భవతి’ చిత్రం రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మంచి టాక్ నే తెచ్చుకుంది. దీంతో ఈ సారి కూడా అదే ఫీట్ చేసేందుకు సిద్దమవుతున్నాడు.

అయితే ఈ సారి జూనియర్ ఎన్టీఆర్‌, మహేష్‌ బాబులతో సై అంటు వస్తున్నాడు. దసరా బరిలో ‘జూ.ఎన్టీఆర్’ నటించిన ‘జై లవ కుశ’..’మహేష్ బాబు’ నటించిన ‘స్పైడర్’ సినిమాలు కూడా నిలుస్తున్నాయి. ఇంతా భారీ కాంపిటీషన్ లో ‘శర్వా’ తన సినిమా రిలీజ్ చేస్తుండటంతో మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారాడు.

హైదరాబాద్ తో పాటు పొల్లాచ్చి, యూరప్ లలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల మీద దృష్టి పట్టిన చిత్రయూనిట్ వినాయక చవితి కానుకగా ఈ నెల 24న మహానుభావుడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేం మెహరీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -