291 స్ధానాలను అభ్యర్థులను ప్రకటించిన మమతా..

42
mamatha

బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటించారు తృణమూల్ చీఫ్,సీఎం మమతా బెనర్జీ. మొత్తం 294 స్ధానాలకు గాను 291 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు మమతా. కీలకమైన నందిగ్రామ్ నుండి బరిలో దిగారు మమతా. మిగిలిన మూడు స్ధానాలైన డార్జిలింగ్, కుర్స్వాన్, కలింపాంగ్ సీట్లను మిత్రపక్షాలకు వదిలేశారు.

ఇచ్చిన మాట ప్రకారం నేను నందిగ్రామ్ నుంచే పోటీ చేస్తున్నా…. భవానీపూర్ నుంచి సొభందేబ్ చట్టోపధ్యాయ్ పోటీ చేస్తారు. ఇది స్మైలీ ఎలక్షన్. సులువుగా గెలుస్తాం. ప్రజల ఆశీర్వాదం కోరుతున్నా అన్నారు మమతా. 50 మంది మహిళలకు పార్టీ టికెట్ ఇవ్వగా 35 మంది ముస్లింలు, 79 మంది ఎస్సీలు, 17 మంది ఎస్టీలకు అవకాశం కల్పించారు. 80 ఏండ్లు పైబడన వారికి టికెట్ ఇవ్వలేదని మమతా చెప్పారు. ఆరుగురు యాక్టర్లు, డైరెక్టర్లకు అవకాశం కల్పించారు.