శర్వానంద్..’మనమే’ ఫస్ట్ సింగిల్

20
- Advertisement -

ప్రామిసింగ్ హీరో శర్వానంద్ 35వ చిత్రం ‘మనమే. ట్యాలెంటెడ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత కాగా, కృతి ప్రసాద్, ఫణి వర్మ ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు. ఏడిద రాజా ఈ చిత్రానికి అసోసియేట్ నిర్మాత.

మ్యూజికల్ ప్రమోషన్స్ ప్రారంభించడానికి మేకర్స్ సిద్ధంగా ఉన్నారు. సక్సెస్ ఫుల్ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో ముందుకు వచ్చారు. ఇక నా మాటే పాటను మార్చి 28న విడుదల చేయనున్నారు. సాంగ్ పోస్టర్‌లో శర్వానంద్ షేడ్స్‌తో ట్రెండీ అవతార్‌లో ఆకట్టుకున్నారు. పోస్టర్ లో స్కేటర్ రైడింగ్ చేస్తూ కనిపించారు.

యూనిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కృతి శెట్టి కథానాయికగా నటిస్తుండగా, చైల్డ్ ఆర్టిస్ట్ విక్రమ్ ఆదిత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకి విష్ణు శర్మ, జ్ఞాన శేఖర్ VS సినిమాటోగ్రఫీని అందించారు. ప్రముఖ టెక్నీషియన్ ప్రవీణ్ పూడి ఎడిటర్, జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్. ఈ చిత్రానికి డైలాగ్స్‌ని అర్జున్ కార్తిక్, ఠాగూర్, వెంకీ అందిస్తున్నారు.

Also Read:IPL 2024 :డీకే.. లాస్ట్ ఐపీఎల్?

- Advertisement -